చిన్నారిపై దాడి అమానుషం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో జామ కాయ కోస్తోందన్న కోపంతో బాలికపై మహిళ విచాక్షణారహితంగా రాయితో దాడి చేసిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆరా తీశారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రికలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యమందించాలని అక్కడి వైద్యలను ఫోన్ ఆదేశించినట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె తెలిపారు. మంగళవారం సాయంత్రం పరిగి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన చిన్నారి అల్ఫియా తన ఇంటి సమీపంలో ఉన్న జామ చెట్టు నుంచి జామ పండు కోయడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న మంజమ్మ ఆగ్రహంతో చిన్నారిపై రాయితో దాడి చేసిందని. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి, స్థానికులు ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రస్తుతం బాలికకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికలో చికిత్స అందజేస్తున్నారని తెలియగానే, మంత్రి సవిత అక్కడి వైద్యులతో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతోనూ మంత్రి సవిత ఫోన్లో మాట్లాడి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జామ పండు కోసం చిన్నారిపై రాయితో దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తంచేశారు. దాడి చేసిన మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న చిన్న విషయాలకే విచక్షణ మరిచిపోయి, దాడులకు దిగడం సరికాదన్నారు. ఇటువంటి ఘటనల వల్ల బాధితులు, నిందితులు కూడా తమ విలువైన జీవితాన్ని కోల్పోయే ప్రమాదముందని, ప్రశాంతమైన జీవనమే శ్రేయస్కరమని మంత్రి సవిత తెలిపారు.