-4.668 ఎకరాల భూమికి అంగీకార పత్రాలు అందజేత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు వడ్డమానుకు చెందిన రైతు బుర్రా శంకర్ రెడ్డి కుటుంబం స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. తమ ఆధీనంలో ఉన్న 4.668 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందించేందుకు అంగీకారం తెలిపింది.
ఈ మేరకు బుధవారం, 2026 అక్టోబర్ 28న బుర్రా శంకర్ రెడ్డి తన కుటుంబానికి చెందిన 4.668 ఎకరాల భూమికి సంబంధించిన అంగీకార పత్రాలను ఏపీసీఆర్డీఏ కాంపిటెంట్ అధికారి కె. విజయలక్ష్మికి అందజేశారు.
ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో స్థానిక రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఏపీసీఆర్డీఏ అధికారులకు సహకరించాలని కోరారు.
