పాలమూరు యాదవ సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

WhatsApp Image 2026 11 15 at 12.23.46 AM Copy

-యాదవులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త:
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో యాదవ బంధుమిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన పాలమూరు యాదవ సదర్ ఉత్సవాలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు విద్య, వ్యాపార, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించవచ్చని పేర్కొన్నారు.
యాదవుల ఐక్యతను చాటుతూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని భావితరాలకు అందించి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కోరారు.