విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఒడిస్సాలోని భువనేశ్వర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు తిరుమల తిరుపతి దేవస్దానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు. సోమవారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసిన సుబ్బారెడ్డి, ఈ నెల 26 తేదీ ఉదయం విగ్రహ ప్రతిష్టా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. 21వ తేదీ నుండి విగ్రహ ప్రతిష్టా పూజా కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, మిధున లగ్నంలో నిర్వహించే స్వామి వారి ప్రాణ పతిష్ట కు విచ్చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నరని అభినందించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు బిసి బెహర, పివి నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …