Breaking News

ధరిత్రీ దినోత్సవమును పురస్కరించుకొని పలు ప్రాంతాలలో మొక్కలు నాటడం…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధరిత్రీ దినోత్సవమును పురస్కరించుకొని పలు ప్రాంతాలలో మొక్కలు నాటడం జరిగినది. ఈ క్రమంలో తాడేపల్లి మండలం సీతానగరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంతంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనలతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు రోడ్డు కు ఇరుప్రక్కల చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు కూడా పాల్గొని చెట్లను నాటారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఎంతో శ్రేయస్కరమని, ఇవి మానవాళికి ఎన్నో విధాలుగా దోహదం చేస్తాయని వెంకటాచార్యులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *