మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించిన ఖనన భూమి పరిరక్షణ, మౌళిక సౌకర్యాలను మరింత మెరుగుపరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 33 వ డివిజన్ పరిధిలో రూ. 25 లక్షల వ్యయంతో ఖబర్ స్టాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి మతపెద్దలు మావులానా షాబా అబ్బాస్ ఇబ్బయిజ్, జాఫర్ అలీ , మీర్ ముసావి, మీర్ ఇనాయిత్ హుస్సేనీ, స్థానిక కార్పొరేటర్ మీర్ అస్గర్ ఆలీ, నజఫ్ ఆలీ, మెహదీ, ఖరార్ ముసవి తదితరులతో కలిసి శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్యే 36 వ డివిజన్ పరిధిలోని ఆంధ్ర జాతీయ కళాశాల వెనుక రోడ్డు లోని 5 లక్షల రూపాయలతో నూతన పైప్ లైన్ ఏర్పాటు కార్యక్రమానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ , డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా (అచ్చాబా), మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు షేక్ సిలార్ దాదా, 36 డివిజన్ కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్, ఎస్ కె బాజీ, మున్సిపల్ కమిషనర్ జి. చంద్రయ్య, మునిసిపల్ ఇంజినీర్ పి.శ్రీకాంత్, పలు డివిజన్ల కార్పొరేటర్లు, ఇంఛార్జి లు, కో – ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు,డి ఈ ,ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …