Breaking News

రైతుబజార్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి..

-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. నుపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతనంగా నిర్మిస్తున్న రైతుబజార్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాల సంస్థ పరిధిలో సాంబమూర్తి రోడ్డు, జి ఎస్‌ రాజు రోడ్డు, కృష్ణలంక రైతుబజార్ల పనులను బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ మార్కెటింగ్‌, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ నూతనంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసువచ్చే విధంగా నిర్మాణం జరుపుకుంటున్న సాంబమూర్తి రోడ్డులోని రైతుబజారు పనులను పరిశీలించి ప్రహారి గోడ పనులు, ఆర్వో ప్లాంట్‌, టాయిలెట్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు పెండిరగ్‌లో ఉన్నందున కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి వేరే కాంట్రాక్టరుకు పనులు అప్పగించాలని అన్నారు. జిఎస్‌ రాజు రోడ్డులోని రైతుబజార్‌ పనులలో భాగంగా ఆర్వో ప్లాంట్‌, ప్రహరి గోడ పనులు పూర్తి చేసి ప్లాస్టింగ్‌, షాపు నెంబర్లు వేయాలన్నారు. కృష్ణలంక రైతు బజారులో గత మూడు నెలలుగా కాంట్రాక్టర్‌ టాయిలెట్ల నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నందున కాంట్రాక్టర్‌కు నోటీస్‌ జారీ చేసి వేరే కాంట్రాక్టరుకు పనులు అప్పగించాలన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చేపట్టిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అధికారులను ఆదేశించారు. పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ వెంట ఏడి మార్కెంటింగ్‌ ఎ కిశోర్‌, డిఇ వి ఎస్‌ ఆర్‌కె ప్రసాద్‌ ఉన్నారు.

192, 193 సచివాలయల ఆకస్మిక తనిఖీ…
గాంధీనగర్‌ 192, 193 సచివాలయలను జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టీ, మూమెంట్‌ రిజిస్ట్రర్లను పరిశీలించారు. సచివాలయ పరిధిలో నమోదుఅయ్యే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు అందుబాటులో ఉండి సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్దిదారులకు చేరే విధంగా సేవలందించాలన్నారు. సచివాలయ పరిధిలో అర్హులు అనర్హుల జాబితా ప్రదర్శించాలన్నారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాధులు రానీయకుండా మెరుగైన సేవలందించాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ సచివాలయ ఉద్యోగులను సిబ్బందిని కోరారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *