Breaking News

జిల్లా సమీక్ష సమావేశానికి సమగ్ర నివేదికలు సిద్ధం చేయండి… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సమీక్షా సమావేశంకు నివేదికలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఈ నెల 26 తేదీన జరగబోవు జిల్లా సమీక్షా సమావేశం నేపథ్యంలో ముందస్తుగా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన పురోగతి, వాటి అమలులో ఎదుర్కొంటున్న సవాళ్లు వాటిని అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమగ్ర నివేదికలతో హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశంలో గౌరవ మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరు అవుతారని, గతంలో డి.ఆర్.సి. లో చర్చించబడిన అంశాలపై తీసుకున్న చర్యలను వారికి నివేదించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లా ప్రణాళికా అధికారి అశోక్ కుమార్, పి.డి. డ్వామా శ్రీనివాసప్రసాద్, ఎస్.ఈ. ఆర్.డబ్ల్యు.ఎస్. విజయ కుమార్, ఎ.డి. సర్వే జయ రాజ్, డి.ఆర్.డి.ఎ. పి.డి. జ్యోతి, మెప్మా పి.డి. రాధమ్మ, హౌసింగ్ పి.డి. చంద్రశేఖర్ బాబు, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ, ఇరిగేషన్ అధికారులు, డి.ఎం.హెచ్.ఓ శ్రీహరి, డి.ఈ.ఓ. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *