Breaking News

ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పై సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనుసరిస్తూ, విజయవాడ నగరపాలక సంస్థ వారు తదుపరి కార్యాచరణ, నియమ నిబoధనల అమలు కొరకు సచివాలయం సిబ్బందితో సదస్సును తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నిర్వహించారు. అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్, కే. వి. సత్యవతి గారు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర కాలుష్య మండలి ఆదేశాలను అనుసరిస్తూ, విజయవాడలో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలుచేయటం జరిగినది అని తెలియచేశారు. దీనితో పాటుగా, జనవరి 26 నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలాను జారీచేశారు. ఈ నిబంధనలు కటినంగా అమలు చేయుటకు, 3 జోన్లలో ప్రత్యేక తనిఖీబృందాలు ఏర్పాటుచేయటం జరిగినదని తెలిపారు. వీటికి అనుసంధానంగా, నగరంలోని 286 వార్డ్ సచివాలయలలోని శానిటేషన్, అడ్మిన్ మరియు రెవెన్యూ సెక్రెటరీలను వార్డు తనిఖీ బృందంగా ఏర్పాటు చేస్తూ వారు వారి పరిధిలో ప్రతీరోజు తనిఖీలు నిర్వహిస్తు ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలుపరిచే భాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లగుంచిన వారిపై భారీ జరిమానా మరియు SWM 2016 చట్టం మార్గదర్శకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి ప్రజలు, వాణిజ్య సముదాయాలు, వీధి వర్తకులు సహకరించాలని, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను (క్లాత్ బ్యానర్లు, జుట్ బ్యాగులు, గుడ్డ సంచులు, పేపర్ కప్పులు మొదలైనవి, పర్యావరణమునకు హానిలేని వస్తువులు) ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ అధికారి, పి.రత్నావళి గారు, మొదలగు నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *