Breaking News

విశాఖ ‘కార్మికగర్జన’కు సంఫీుభావంగా…

-23, 24 తేదీల్లో ఆర్డీవో కార్యాలయాలు, 25న కలెక్టరేట్ల వద్ద దీక్షలు
-విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మోదీ, జగన్‌ మౌనం
-ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదానీకి అప్పగింతా?
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
-కార్మికగర్జనకు సంఫీుభావ దీక్షల పోస్టరు ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, విశాఖలో ఈనెల 30న కార్మిక గర్జనకు సంఫీుభావంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న దీక్షలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ-ఏఐటీయూసీ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో ఈనెల 23, 24 తేదీల్లో అన్ని రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, 25వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద దీక్షలకు దిగనున్నట్లు వెల్లడిరచారు.
విజయవాడ దాసరిభవన్‌లో శుక్రవారం ఈ దీక్షల పోస్టరును ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు కె రామాంజనేయులుతో కలిసి రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ…విశాఖ ఉక్కుకు ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉందనీ, అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తుంటే సీఎం జగన్‌ మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కార్మికులు, కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయని వివరించారు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని నడిపేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. ఈ పోరాటం ప్రారంభమై రెండేళ్లు అయినా మోదీ ఇంతవరకు స్పందించలేదని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటు కార్మికులంతా కలిసి ఉద్యమం చేస్తున్నప్పటికీ సీఎం జగన్‌లో చలనం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరమైతే అక్కడ భూమి స్వాధీనం చేసుకోవచ్చని జగన్‌ చూస్తున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ కారుచౌకగా ఆదానీ, అంబానీలకు మోదీ కట్టబెడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కుపై మోదీకి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేని దుస్థితిలో జగన్‌ ఉండడం విచారకరమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఆదానికి అప్పగిస్తారనే ప్రచారముందన్నారు. ఆదానీకి ఊడిగం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఆదానీ ఇచ్చే కమీషన్లకు మోదీ, జగన్‌ కక్కుర్తిపడి ఈ తరహాగా ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అప్పగిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం చేపట్టే ఉద్యమానికి సీపీఐ`ఏఐటీయూసీ ఆది నుంచి సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. 30వ తేదీన విశాఖలో వేలాది మందితో జరిగే కార్మికగర్జనకు సంఫీుభావంగా సీపీఐ`ఏఐటీయూసీ నేతృత్వంలో తలపెట్టిన దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికగర్జనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అదానీకి ఊడిగం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని రామకృష్ణ ధ్వజమెత్తారు.

అన్నీ ఆదానీ పాల్జేస్తే…ఏపీలో ప్రభుత్వం ఎందుకు?: ఓబులేసు
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడానికి మోదీ, జగన్‌ తెగ తాపత్రయ పడుతున్నారని, ఆదానీకి ప్రభుత్వరంగ సంస్థలను దోచిపెడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు విమర్శించారు. అన్నీ అదానీ పాలు చేస్తే…ఏపీలో ఇక ప్రభుత్వం ఎందుకనీ ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల మధ్య కూడా జగన్‌ చిచ్చు పెట్టారనీ, గతేడాది ఫిబ్రవరిలో జరిగిన చలో విజయవాడతో జగన్‌ వారిపై కక్ష కట్టారని తెలిపారు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులకు చట్టబద్దంగా వేతనాలు ఇవ్వడం లేదని, ప్రతి నెలా వేతనాల కోసం అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గతంలో ఎంతో పేరున్న తమిళనాడు సీఎం జయలలితే ఉద్యోగులతో వివాదంపై వెనక్కి తగ్గిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్‌ కూడా భవిష్యత్తులో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. నాడు ఓట్ల కోసం జగన్‌ హామీలిచ్చి…అధికారంలోకి వచ్చాక మోసగిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఉద్యోగులు కోరుతుంటే వారిని ఇబ్బందులు పెడతారా? అని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ వైఖరి మార్చుకుని ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 30న విశాఖలో జరిగే కార్మిక గర్జనకు తరలిరావలన్నారు. ఈ కార్మిక గర్జనకు మద్దతుగా ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, 25వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద దీక్షలను పార్టీ శ్రేణులు, కార్మికలోకం పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఓబులేసు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *