Breaking News

నూతన శకానికి నాంది పలికిన ‘ఉల్కా’ టీవీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌), ప్రైవేటురంగ సంస్థ. సిటీ ఆన్‌లైన్‌ మీడియా సంయుక్తంగా టెలివిజన్‌ రంగంలో అడుగుపెట్టి ‘ఉల్కా’ టీవీ పేరుతో డిజిటల్‌ టెలివిజన్‌ చానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ టీవీని బీఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ వివేక్‌ బంజాల్‌ విజయవాడలో శుక్రవారం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఉల్కా’ టీవీ సేవల ప్రారంభంతో, ఉన్నతమైన నాణ్యతతో 4కె టీవీ ప్రసారాలలో దేశంలోనే ఒక నూతన శకానికి నాంది పలికినట్లు అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 27 లక్షల మంది తమ ఫైబర్‌ బ్రాడ్‌బ్రాండ్‌ను వినియోగిస్తున్నారన్నారు. వారితోపాటు కొత్తగా చేరే వినియోగదారులకు 1000కు పైబడి చానళ్లను ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్రాండ్‌ కనెక్షన్‌ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఉల్కా టీవీకి ఎలాంటి సెట్‌టాప్‌ బాక్సులు, యాంటీనాలు అవసరం లేదని.. వైఫై, ల్యాన్‌ ద్వారా టీవీ సేవలను పొందవచ్చని వివరించారు. కీబోర్డు, కెమెరాలను అమర్చుకుని ఐపీటీవీ ద్వారా వీడియో కాన్ఫెరెన్స్‌లు, విద్య, వైద్య సంబంధిత సేవలు పొందవచ్చని తెలిపారు. ఉల్కా టీవీలో మొత్తం ఐదు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని వెల్లడిరచారు. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం 350 ఉచిత చానళ్లతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్రీ ఎయిర్‌ ప్యాక్‌ రూ.130, ఎస్జీ బేసిక్‌ 350 ఉచిత చానళ్లతో పాటు 32 చెల్లింపు చానళ్లను రూ.229లకు ప్యాకేజీ అందుబాటులో ఉందన్నారు. ఎస్టీ బొనాంజా కింద 350 ఉచిత చానళ్లతోపాటు 52 చెల్లింపు చానళ్లను రూ.259లకు వినియోగదారులు పొందవచ్చన్నారు. హెచ్‌డి బేసిక్‌లో రూ.279లకు 30 చెల్లింపు చానళ్లతోపాటు, 350 ఉచిత చానళ్లను పొందవచ్చన్నారు. హెచ్‌డి బొనాంజా పేరుతో 53 చెల్లింపు చానళ్లతోపాటు 350 ఉచిత చానళ్లను రూ.329లకు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పీ.గురుప్రసాద్‌, ఎండ్‌ (జనరల్‌), విజయవాడ ఈ సౌకర్యాన్ని ఎంచుకొని తొలి వినియోగదారుడిగా నమోదయ్యారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎఫ్‌ జీఎం వివేక్‌ దుయా, బీఎన్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ సీజీఎం సురేష్‌ కృష్ణ, సిటీ ఆన్‌లైన్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ డైరెక్టర్‌ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *