విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స్థానిక సీతారాంపురం జంక్షన్, ఏలూరురోడ్‌లో గురువారం ‘‘శాంసంగ్’’ స్మార్ట్ కేఫ్ అవుట్‌లెట్ షోరూంను ‘‘శాంసంగ్’’ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పరుశురాం చేతుల మీదుగా షోరూం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా షోరూం అధినేత అమర్‌కుమార్ మాట్లాడుతూ… ఈ షోరూం తమ బ్రాంచ్‌లో మూడవదని గుంటూరులో రెండు బ్రాంచీలు నడుపుతున్నామని మావద్ద అన్ని శాంసంగ్ సెల్‌ఫోన్లు అత్యాధునిక మోడల్స్‌లో, విభిన్న తరహాలో ఆకర్షణీయమైన రంగులతో, వినియోగదారుల అభిరుచి మేరకు అందుబాటు ధరలలో నాణ్యమైన, నమ్మకమైన ‘‘శాంసంగ్’’ ఉత్పత్తులను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఈ షోరూంను ప్రారంభించామని అన్నారు. మార్కెట్లో ఎన్ని బ్రాండ్ కంపెనీలు ఉన్నా, ‘‘శాంసంగ్’’ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉన్నదని, దానికి నిదర్శనం మా అమ్మకాలే అని తెలిపారు. మాషోరూంనందు 4 జీతో పాటు 5 జీ ఫోన్లు కూడా వివిధ ఫీచర్లతో ‘‘శాంసంగ్’’ ఫోన్లు వినియోగదారులకు అందజేస్తున్నామని అన్నారు. లాభాపేక్షలేకుండా సరసమైన ధరలకు ‘‘శాంసంగ్’’ మొబైల్స్ అప్ టూ డేట్ మోడల్స్ వినియోగదారునికి తమవద్ద లభించేలా ఏర్పాటుచేసి కస్టమర్ సేవలు అందిస్తున్నామన్నారు. ‘‘శాంసంగ్’’ ఒరిజినల్ మోబైల్ స్మార్ట్‌ఫోన్స్ తమ వద్ద దొరుకుతాయని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ‘‘శాంసంగ్’’ కంపెనీ సిబ్బంది, షోరూం సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …