50వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పట్టాభిరామ్

WhatsApp Image 2026 10 24 at 8.13.29 PM

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి షేక్ ఆషాల తరఫున స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కరపత్రాలు పంచారు. మేయర్ అభ్యర్థి రాధాకృష్ణకు గ్లాసు గుర్తుపైన, కార్పోరేటర్ అభ్యర్థి షేక్ ఆషాకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టాభిరామ్ కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లాహ్ తోపాటు కూటమి నేతలు, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.