Breaking News

8న షర్మిల తెనాలి సెంబ్లీకి రాక

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేకహోదా పేరుతో ధర్నా చేయడంతో పాటు జిల్లాల వారీగా సభల్ని పెట్టాలన్న భాగంగా 8న తెనాలి, కొలకలూరు రానున్నారు. సీనియర్ నేతలంతా యాక్టివ్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున చిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా నేతలకు ఓపిక ఉండేది కాదు. ఎందుకంటే మీడియా పట్టించుకోదు. ప్రజలకూ ఆసక్తి ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. షర్మిల సమావేశం ఏర్పాటు చేశారంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మీడియా సమావేశం పెడితే ప్రత్యేకంగా కవరేజీ వస్తోంది. సాక్షి మీడియాలో ఆమెకు వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల మరింతగా ఆమె గురించి మరింతగా చర్చ జరుగుతోంది. జిల్లాల వారీగా నిరవహించిన సమావేశాల తర్వాత కాంగ్రెస్ నేతలకు ఓ ధైర్యం వచ్చింది. ఉన్న పళంగా కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందన్న నమ్మకానికి వస్తున్నారు.

బహిరంగసభల్ని నిర్వహించగలమన్న నమ్మకానికి వచ్చారు. మడకశిర నుంచి బహిరంగసభుల్ని ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్ పై అభిమానం ఉన్న వారు లేకుండా ఉండరు. అయితే వారితో ఓటు వేయించుకోవడమే కీలకం. ఇప్పుడా బాధ్యతను షర్మిల పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగైదు శాతంమ ఓటు బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకోగలిగితే షర్మిల ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం అవుతారు. ఈ దిశగా తొలి అడుగులోనే తాను అనుకున్నది సాధిస్తున్నారు.

తెనాలి అసెంబ్లీకి సంబంథించి సీనియర్ నాయకుకుడు Dr.చందు సాంబశివుడు కాంగ్రేస్ సంక్లిష్టంలో ఉన్నప్పటి నుండీ పార్టీ వెన్నంటి ఉండి పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందనే విశ్వాసం ప్రజలలో తనదైన పంథాతో ఆపార్టీ విథానాలను ముందుకు తీసికెళ్తూ కొనసాగిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *