Breaking News

పేద  ప్రజల ఆరోగ్య ఆర్థిక అభివృద్ధికి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం వైయస్  జగన్మోహన్ రెడ్డి

– పౌరులకు వైద్యం విద్య న్యాయం సక్రమంగా అందితే  దేశం అభివృద్ధి చెందుతుంది.
-అమ్మ ఒడి అనే ఔషధం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అవసరమైన చర్యలు తీసుకున్నాం
– ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా నూతనంగా వైద్య కళాశాలలో నిర్మించుకుంటున్నాం.
– జిల్లా ఇంఛార్జి మంత్రి వేణు గోపాలకృష్ణ

ధవలేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సేవ చేసేందుకు వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయని, పౌరు లకు వైద్యం విద్య న్యాయం సక్రమంగా ప్రజలకు అందితే ఆ దేశం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కమ్యూనిటీ హాల్ లో గ్రామ సంఘాల సహాయకులు, ఆశా వర్కర్ల ఆత్మీయ సమావేశానికి మంత్రి వేణు గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ మన రాజ్యాంగంలో అనేక వ్యవస్థలు వచ్చాయని ఆ వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా పని చేసినప్పుడు అందరికీ సమ న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. దేశానికి గొప్ప రాజ్యాంగం ఉందని అమలు చేసే నాయకులు చిత్తశుద్ధితో రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తే చివరి స్థాయి లబ్ధిదారుల వరకు వాటి ఫలితాలు అంది అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు. సంస్కరణలో ఆనాడు జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య కొరకు ఎనలేని కృషి చేయడం వాటి యొక్క సత్ఫలితాలు నేడు కనపడుతున్నాయి అన్నారు. సంస్కరణలో భాగంగా విద్య కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ మన విద్యార్థులు దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రతిభను కనబరిచే ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్ మీడియం, ఆరోగ్యానికి సంబంధించి జగనన్న గోరుముద్ద, పాఠశాల ఆధుణీకరణ, జగనన్న విద్యా కానుక, ఫీజు రీయంబర్స్మెంట్ , బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. గత పాలకులు ఇచ్చిణ హామీ లను నెరవేర్చలేదని నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళా సంఘాలకు ఆసరా ద్వారా వడ్డీ రుణమాఫీ నాలుగు విడతల్లో చేస్తానని వాగ్దానం చేసి అమలు చేసి నిరూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో మెడికల్ కళాశాలలు 11 మాత్రమే ఉండేవని, నూతనముగా మరో 17 వైద్య బోధన కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి అన్నారు. వీటి నిర్వహణకు గాను వైద్య విభాగంలో 55 వేల పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. మరోవైపు ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజల ఆరోగ్య ఆర్థిక అభివృద్ధి దిశగా సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నాగేశ్వర్, వైయస్ఆర్సిపి రాష్ట్రా కార్యధర్శి గిరజాల బాబు, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి చిన వీరభద్రయ్య,  జె.సి.యస్ కన్వీనర్ తడాల చక్రవర్తి, స్థానిక నాయకులు గిరజాల బాబు, సత్తిరెడ్డి సూరిబాబు, బొప్పన సుబ్బారావు, అంగాడి సత్యప్రియ, ఆచంట వెంకట సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *