Breaking News

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ తనిఖీలు

– భద్రత చర్యలు, సీ సీ కెమెరాల వ్యవస్థ పరిశీలనా
-హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు
-జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ వి ఎమ్ గోడౌన్ ల యొక్క సాధారణ తనిఖీల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబందించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గొడౌన్ ను తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఏర్పాటు చేసిన ఈ వి ఎమ్స్ భద్రపరచిన గోడౌన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ  కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శక మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎన్నికల గోడౌన్ ను తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లు సిసి కలెక్టర్ తెలిపారు. పోలీసు భద్రత తో పాటు, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. మూడు షిఫ్ట్ లలో పోలీసు భద్రత , సీసి కెమెరాల నిరంతరం పర్యవేక్షణ చేసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, ఏస్ డి సీ ఆర్.. కృష్ణ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ ఎమ్. పవన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు  కాంగ్రెస్ – నలబాటి రమేష్ (శ్యామ్) , వైయస్ఆర్ సీపీ – వై రాజశేఖర్, రాయుడు గణేష్ , టిడిపి – సిహెచ్ . శ్రీనివాస రావు ,   బిజెపి – బి. రామచంద్ర రావు,   కలెక్టరేట్ సిబ్బంది  తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *