రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నెం.11/2023 ద్వారా నోటిఫై చేయబడిన గ్రూప్ -2 పోస్టుల కోసం వ్రాత పరీక్షలను (Off-Line) ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది.25.02.2024 ఉదయం 10.30 నుండి మద్యాహ్నం 1.00 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలియ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబందిత అదికారులతో సమన్వయ సమావేశము నిర్వహించడమైనది. తూర్పు గోదావరి జిల్లా నందు 53 పరీక్ష కేంద్రములలో 18501 మంది పరీక్ష కు హాజరు అగుచున్నారు. సదరు పరీక్ష నిర్వహణకు 53 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 53 మంది మండల స్థాయి అధికారులను లైజన్ ఆఫీసర్లు గా మరియు 18 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లు గా నియమించడం జరిగింది. పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి పగద్బందీగా ఏర్పాట్లు చేయడమైనది.
అభ్యర్ధులకు సూచనలు:-
పరీక్ష ఉదయం 10.30 నుండి మద్యాహ్నం 1.00 వరకు జరుగును. పరీక్షా కేంద్రములోనికి ఉదయం 9.30 నుండి 10.15 వరకు అభ్యరులను అనుమతించ బడును. ఉదయము 10.15 గంటల తరువాత పరీక్ష హాలు లోనికి అభ్యర్ధులను అనుమతించబడదు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటుగా ఒక ఒరిజినల్ ఫోటో I.D (పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ -, etc) తో హాజరు కావలెను. హాల్ టికెట్ నందు ఫోటో లేక పోయినా, ఫోటో సరిగా లేని అభ్యర్ధులు గెజిటెడ్ అధికారి సంతకముతో 3 పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటో లతో హాజరు కావలెను. పరీక్షా కేంద్రము లోపలకు సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ మొదలగు ఎలక్ట్రానిక్ పరికరములు అనుమతించబడవు.
Prajavartha Online Telugu News