అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఐ.జి.లు, డి.ఐ.జి.లు, సీపీలు, ఎస్పీలతో వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, అదనపు సీఈవో లు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఐ.జి.లు, డి.ఐ.జి.లు, సీపీలు, ఎస్పీలు వారి జిల్లాలనుండి ఈ వీడియో కాన్పరెన్సు లో పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …