విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135 సి ప్రకారం , u/s 20(1) ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ రోజు అనగా మే 13వ తేదీకి 48 గంటలు ముందు అనగా మే 11వ తేది సాయంత్రం 7గంటల నుండి మే 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు,కల్లు అంగళ్లు, హోటల్లు, రెస్టారెంట్ క్లబ్బులు, ఇతర మద్యం షాపులు మూసి ఉంచి, డ్రై డే (dry day) పాటించాలని, అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజు అనగా జూన్ 4వ తేదీన కూడా డ్రై డే గా పాటించాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags vijayawada
Check Also
మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురానున్న గోవా షిప్‌యార్డ్
-రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ -సుమారు 10 వేల మందికి ప్రత్యక్ష …
Prajavartha Online Telugu News