Breaking News

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల‌ను అఖండ మెజార్టీతో గెలిపించండి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేసిన మంచిని చూసి ప్రజ‌లు ఓట్లు వేయ‌బోతున్నార‌ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 61వ డివిజన్ పాయకాపురంలో గురువారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, వెలంపల్లి అల్లుడు రాందేవ్ తో ప్రతి గడపకు వెళ్లి.. జగనన్న పాలనలో జరిగిన మేలును వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు నేరుగా ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్ధం చెబుతూ.. అందులో 99.4 శాతం హామీలను నెరవేర్చినట్లు వివరించారు. అది చూసి ఓర్వలేక కూటమి నేతలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్నారు. చంద్రబాబు కుట్రలు చేసి సంక్షేమ పథకాలు ఆపగలరేమో కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మాత్రం ఆపలేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఐదేళ్లలో అక్షరాల రూ. 47.68 కోట్ల సంక్షేమం
గత ప్రభుత్వంలో అభివృధ్దికి నోచుకోని కుటుంబాలు మన ప్రభుత్వంలో హాయిగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుపై ఆశలు కల్పించారని మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల ఒరవడిని మరింత పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లలో డివిజన్లో అక్షరాల రూ. 47.68 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతి నెలా 1,697 మందికి ఇంటి వద్దకే ఠంఛన్ గా పింఛన్ అందజేస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 1999 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 6.75 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 1,626 మంది తల్లులకు రూ. 5.23 కోట్లు., చేదోడు ద్వారా 83 మందికి రూ. 17 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 108 మందికి రూ. 27.45 లక్షలు., జగనన్న విద్యాదీవెన ద్వారా 880 మందికి రూ. 2.59 కోట్లు., వసతి దీవెన ద్వారా 817 మందికి రూ. 88.62 లక్షలు., కాపు నేస్తం ద్వారా 180 మందికి రూ. 60 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 2,530 మందికి రూ. 1.03 కోట్లు., వైఎస్సార్ చేయూత ద్వారా 592 మందికి రూ. 2.30 కోట్ల సంక్షేమాన్ని డివిజన్ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు. సీఎం జగన్ ఆలోచనలను, నవరత్నాల పథకాలను తట్టుకుని నిలబడే శక్తి రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదని స్పష్టం చేశారు.

మేలు చేసే ప్రభుత్వం మాది

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా తామంతా పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధానంగా రూ.84.35 లక్షలతో శాంతినగర్ ప్రధాన రహదారి నిర్మించుకున్నట్లు వెల్లడించారు. రూ. 69 లక్షలతో హెచ్ బ్లాక్ లో రహదారులు, రూ.93 లక్షలతో ప్రశాంతి నగర్లో నూతన రోడ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విడుదలైన రూ. 80 లక్షలతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. ఎలక్ట్రిసిటీ కాలనీలో రూ. 30 లక్షలు, ప్రగతినగర్లో రూ. 40 లక్షలతో సిమెంట్ రోడ్లను నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. గత తెలుగుదేశం హయాంలో పాయకాపురం చెరువు ఆక్రమణలకు గురికాగా.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 3.71 కోట్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది ప్రారంభించుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. హెచ్ బ్లాక్ లో రూ. 70 లక్షలతో స్థానికంగా నూతన సచివాలయ భవనాన్ని నిర్మించి ప్రారంభించుకోవడం ద్వారా.. ప్రజలకు పాలన మరింత చేరువైందన్నారు. తెలుగుదేశం హయాంలో ఈ పనులన్నీ ఎందుకు చేయలేకపోయారో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. అలాగే వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీని అందించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉమ్మడి వెంకట్రావు, నాళం బాబు, బి.కళ్యాణి, వెంకటేశ్వరరావు, మీసాల సత్యనారాయణ, ఆర్.ఎస్.నాయుడు, మాలకొండయ్య, కె.ఎస్.ఆర్.నాయుడు, నాగరాజు, ప్రకాష్, నాగిరెడ్డి, నాగమణి, రంగారెడ్డి, ప్రసాద్ రెడ్డి, అనిల్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *