Breaking News

పేదలకు ఇంటి స్థలాలపై సర్వ హక్కులు కల్పించిన ప్రభుత్వం మనదే

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేసిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పాయకాపురంలో ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల కోసం దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆఖరి క్షణం వరకు పోరాటం చేశారని.. ఆయన స్ఫూర్తితో 2019 నుంచి ఇప్పటివరకు పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం నిర్వీరామంగా కృషి చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో.. క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన దిశానిర్దేశం చేస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిచేసినట్లు వెల్లడించారు. జీవో నెం.32 (30.01.2023) ద్వారా గతంలో పునరావాస లబ్ధిదారులకు కేటాయించిన రాజరాజేశ్వరి పేట, వాంబేకాలనీలోని 2,763 ఇళ్లకు రిజిస్ట్రేషన్లను పూర్తిచేసినట్లు వెల్లడించారు. అలాగే నిషేధిత భూముల జాబితా సెక్షన్‌ 22(ఏ) లో ఉన్న భూములను సదరు జాబితా నుంచి తొలగించి.. నార్త్ మండల పరిధిలోని 20,944 కుటుంబాలకు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించడంతో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న భూసమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. జీవో నెం. 60 (16.02.2023) ద్వారా 100 గజాల లోపు ఉన్న 115 కుటుంబాలకు ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ జీవో 84 (24.02.2023) ద్వారా అర్హులైన 264 మందికి హక్కులు కల్పిస్తునట్లు చెప్పారు. నందమూరినగర్లోని ఆర్ & బి స్థలంలో 69 మంది నివాసులు దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యకు జీవో నెం. 11 ద్వారా పరిష్కారం చూపడమైనది. అలాగే కస్తూరిభాయిపేట, గిరిపురం పరిధిలోని నిరంభ్యతర ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల స్థలాలను రెగ్యులరైజేషన్ చేసి.. 98 మంది లబ్ధిదారులకు హక్కుతో కూడిన పట్టాలు పంపిణీ చేయడమైంది. అలాగే సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 29,272 మంది నిరుపేదలకు జగనన్న కాలనీలలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు వివరించారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలకు ఇంతటి చక్కని పాలన అందిస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *