-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను, కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి కౌంటింగ్ కు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. గురువారం మధ్యాహ్నం సదరు స్ట్రాంగ్ రూంల భద్రత ఏర్పాట్లను పరిశీలించి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను మరియు తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు, 23- తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను, మెష్, బ్యారికేడింగ్ సీటింగ్, ఇంటర్నెట్ ఏర్పాటు తదితర అంశాలపై పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నందు ఈవిఎం లను పరిశీలించారు. సందర్శకుల రిజిష్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట రిటర్నింగ్ అధికారులు ధ్యాన చంద్ర, అదితి సింగ్, చంద్రగిరి రిటర్నింగ్ అధికారి నిషాంత్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ ఎ.ఆర్ శ్రీనివాస రావు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.