Breaking News

జూన్ నెల సామాజిక పెన్షన్ లు డిబిటి ద్వారా బ్యాంక్ అకౌంట్ లకు జమ

-బ్యాంక్ అకౌంట్లు లేని వారికి , 80 సం.లు దాటిన వృద్దులకు మరియు ఇతర రాష్ట్రాల లోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఖాతా వున్న వారికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ ల పంపిణీ
-జిల్లాలో 2,69,684 మంది లబ్దిదారులకు సుమారు రూ.80.25 కోట్లు పంపిణీ: జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2,69,684 మంది లబ్దిదారులకు సుమారు రూ.80.25 కోట్లు సామాజిక భద్రత పెన్షన్లు జూన్ 1 నుండి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా మే మాసానికి చెందిన జూన్ నెలలో పంపిణీ చేయాల్సిన సామాజిక పెన్షన్ నగదును ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లు ఉన్న లబ్దిదారులకు డిబిటి ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందని, సచివాలయాలకు వారు పెన్షన్ కొరకు రానవసరం లేకుండా ఆధార్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్ లను డిబిటి పద్ధతి ద్వారా నేరుగా జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్ ల కింద జూన్ నెలలో 2,69,684 మంది లబ్దిదారులకు సుమారు రూ.80.25 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 1,95,865 లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్నాయని, వీరికి డిబిటి ద్వారా జూన్ 01 వ తేదీన పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందని, మిగిలిన 73,819 మందికి సైతం జూన్ 01 వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ ల ఆధ్వర్యంలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ ల వద్ద ప్రత్యేక కౌంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ ల పంపిణీ పై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కావున సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కొరకు వ్యయ ప్రయాసలకోర్చి సచివాలయానికి రానవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *