Breaking News

తిరుమల వేంకటేశ్వర స్వామి మా కులదైవం

-నేను ఏ సంకల్పం తీసుకున్నా ముందుగా శ్రీవారిని దర్శించుకుంటాను
-రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఇంతటి విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు
-రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైంది
-ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను
-సంపద సృష్టించడమే కాదు అది పేదలకు అందించడమే నా ప్రధాన లక్ష్యం
-పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తా
-దేశ రాజకీయాల్లో ఏపి కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది
-ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, తాను చాలా ఎలక్షన్లు చూసానని, ఎప్పుడు కూడా ఇంత పెద్ద విజయం ఇవ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుపతి తిరుమల రెండు రోజులు పర్యటన లో భాగంగా గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహం నందు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, తాను చాలా ఎలక్షన్స్ చూసానని, ఎప్పుడు కూడా ఇంత పెద్ద విజయం ప్రజలు ఇవ్వలేదని, ఇదొక హిస్టారికల్ విక్టరీ అని, 93 శాతం స్ట్రైకింగ్ ఎప్పుడు జరగలేదని రాష్ట్ర చరిత్రలోను దేశ చరిత్రలో కూడా తనకు గుర్తున్నంతవరకు ఇంత హిస్టారికల్ విజయం ఎప్పుడు రాలేదన్నారు. ఈ నెల 12 న ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, నేషనల్ బిజెపి పార్టీ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యమైన ప్రముఖులందరూ రావడం జరిగిందన్నారు. వెంకటేశ్వర స్వామి వారి కులదైవం అని, తాను ఏ సంకల్పం చేసిన ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామి తలచుకొని ఆ సంకల్ప ప్రకారము చేయడం జరుగుతుందని, తాను చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో నుంచి కూడా శ్రీవారి మెట్లు ద్వారా నడిచి వచ్చి శ్రీవారి మొక్కులు తీర్చుకోవడానికి నడిచి రావడం మళ్లీ తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్లడం అది తన జీవిత ప్రారంభమని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించే పరిస్థితి వచ్చిందన్నారు.

2003 సంవత్సరం లో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కు వస్తుంటే ఆరోజు నాపై క్లైమోర్ మయిన్స్ దాడి జరిగినప్పుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి వారే తనను కాపాడారని,దానికి కారణాలు అనేకం కావచ్చు, ఆయన సేవకు తాను వచ్చేటప్పుడు చనిపోతే స్వామి వారికి కూడా చెడ్డ పేరు రావచ్చునేమో అని, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి, ఈ జాతికేదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినట్లు నాకు ప్రాణభిక్ష పెట్టారని తెలిపారు. 1983 సంవత్సరం లో అప్పటి ముఖ్యమంత్రి యన్ టి ఆర్ తిరుమల లో తల పెట్టిన ఉచిత భోజనం పథకం నిరంతరం కొనసాగుతోందని, తర్వాత దేవాన్స్ పుట్టినప్పటి నుంచి ఒక రోజు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ఇస్తున్నారని తెలిపారు. గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒకరోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇది ఒక అరుదైన అనుభవం అని అన్నారు. తాను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటానని, తాను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్ర లేచి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తానని, ప్రార్థన చేస్తానని, ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటానని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, భారతీయుల్లో తెలుగుజాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలని, భారతీయులు ప్రపంచం మొత్తంలో నెంబర్ వన్ గా ఉంటే అందులో 30% తెలుగువారు ఉండాలని కోరుకుంటానని తెలిపారు. మెరుగైన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుందని, అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలని, ఒకతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వ వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం అవుతుందన్నారు.

తాను ముఖ్యమంత్రి గా ఉన్నపుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని, 1995 సంవత్సరం వరకు పరిపాలనంటే సెక్రటెరియట్ కు పరిమితమైనదని,పరిపాలనను ప్రజల మధ్యకు తీసుకురావడంతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఆరోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే ప్రముఖులు
హైదరాబాద్ కు రావడం మొదలుపెట్టారని గుర్తు చేశారు.

ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం గుర్తిస్తుంది. అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ, ఇది చాలామందికి అర్థం కాదని, భారతదేశంలో కుటుంబ వ్యవస్థను చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జి చేస్తుంది, ఒక ఆనందాన్నిస్తుంది, ఎన్ని కష్టాలు ఉన్నా పంచుకునే భాగస్వాములు ఉంటారని, భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శ వ్యవస్థ అని ,ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదించాలని కోరానని తెలిపారు.వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని, ఎందుకంటే తెలుగుజాతి కూడా ప్రపంచం మొత్తం లో భారతీయులు వున్నారని, జీవితంలో ఒక్కసారైనా కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని చూడాలి అనుకుంటారని, ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో వస్తా ఉంటారని అన్నారు.

ఇది స్వచ్ఛందంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల నిర్మాణం ఉద్యమంగా చేపట్టి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద నిర్మించి తద్వారా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తెలుగు వారు,ఇండియన్స్ బాగుండాలని, అందులో అగ్రస్థానంలో తెలుగుజాతి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉన్నప్పుడు, అందులో 35% తెలుగు జాతి ఉండాలనేదే తమ పార్టీ నాయకుడు కల అని, అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం జరుగుతుందన్నారు.

అదే ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు, సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ తానే ప్రారంభించానని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రోడ్లు విషయం చూస్తే నేషనల్ హైవే చెన్నై టు నెల్లూరు ప్రాజెక్ట్ మొదటి సారిగా చేపట్టడం జరిగిందనీ, అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయ్ గారు దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్డు వచ్చిందన్నారు.

ఫస్ట్ టెలిఫోన్ మీరందరూ ఫోన్లు పట్టుకొని ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు చూస్తే ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అదొక నిత్యావసరం అయిపోయిందని, వర్చువల్ గా ఎక్కడున్నా అన్ని పనులు చేసుకోగలిగే పరిస్థితి వచ్చిందన్నారు.

తప్పులు చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కూడా సహకరించడని, దేవుడు చెప్పింది కూడా మంచి వాళ్ళని కాపాడుకోవాలని, చెడు వ్యక్తులను శిక్షించాలని, సమాజాన్ని కాపాడాలని, తన కుటుంబానికి కొంచెం సమయం కేటాయించాలని, తనకు ప్రజల మీద అపారమైన గౌరవం ఉందనీ, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి తమ బాధ్యత నిర్వహించమని చెప్పానని, ప్రజలు ఆ బాధ్యత నిర్వహించారని, ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టారు అని, తాను ఏ ఒక్కరి వ్యక్తిని కాదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా తాను అందరి వాడిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పనిలేదు, పరదాలు కట్టే పరిస్థితి లేదని, ప్రజాపాలన ప్రారంభం అయిందని, గతంలో ఉద్యోగస్తులు ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ లు ఇబ్బంది పడ్డారని, ప్రజలు కూడా మాకు ఫలానా అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని, ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టం అపారం, ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన నష్టం 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయిందని, తనకు ఎక్కడ రాగద్వేశాలు లేవని, అదే సమయంలో మాపై బాధ్యత పెరిగిందని అన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ లేదా నెంబర్ 2 లో ఉంటుందని, అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారని ఆకాంక్షించారు. భారతదేశంలో టెక్నాలజీని, ఐటిని అందిపుచ్చుకున్నాం అని, తర్వాత అంచలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారని, సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరమని, ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానం నుండి తెలుగుజాతి అందుకే ఇవన్నీ గుర్తు పెట్టుకొని 2047 కి నా ఆలోచన, కమిట్మెంట్ తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి, నెంబర్ టు పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ తెలంగాణ కు వెళ్ళింది, మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయడానికి అమరావతి, పోలవరం పనులు రెండు ప్రారంభించాను. కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసిన పరిస్థితి వచ్చాయి. నా ఆరోగ్యం, నా కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం, ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని స్వామిని కోరుకున్నానని అన్నారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తాను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని కోరుకున్నానని అన్నారు. వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం దర్శనానికి వస్తే ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుందని, ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగన్ ఉండకూడదని అన్నారు.

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్నారు. వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అపచారం చేస్తే, వారికి ఈ జన్మలోనే శిక్ష తప్పదు అని తాను చాలా మందిని చూశానని అన్నారు. డబ్బులు, రౌడీయిజం దీనితోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమి జరగదని, తాను ఒకటే చెప్తున్న మంచి ప్రోత్సహిస్తా చెడుపై గట్టిగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని, మనం అందరూ కూడా కలిసికట్టుగా పని చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ సమావేశంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు ప్రసాద్ రావు,ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తిరుపతి, శ్రీకాళహస్తి సత్యవేడు, నగిరి, పూతలపట్టు,చిత్తూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆదిమూలం,గాలి భానుప్రకాశ్ ,మురళీమోహన్,గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *