Breaking News

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తున్నాం.

– రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో  19,861 మంది లబ్ధిదారులకురు. 13.58 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్  అందజేశాం
-హుకుంపేట డి బ్లాక్ వద్ద రు. 5 లక్షల తో నిర్మించనున్న  బోర్ వెల్ కు శాసనసభ్యులు శంకుస్థాపన
-రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నారని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల చౌదరి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట డి బ్లాక్ వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఉదయాన్నే అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేసే ఘనత ఈ ప్రభుత్వానికి అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వలన 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ, అనేక కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్నామని శాసనసభ్యులు అన్నారు. గత మూడు నెలల బకాయి రు. 3 వేల రూపాయలతో పాటు జూలై మాసంలో అందించే రు. 4000 రూపాయలు కలుపుకొని మొత్తం లబ్ధిదారులకు రు. 7000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేల రూపాయల నుంచి రు.6000 రూపాయలు పెంచి పెన్షన్ అందిస్తున్నామన్నారు. నడవలేని బయటికి వచ్చే పరిస్థితి లేని వారికి వైద్య ఫంక్షన్ గా రు. 10 వేల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 16 వేల మంది ఉపాధ్యాయులు పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన గోదావరి జలాలను అందిస్తామన్నారు. అదేవిధంగా అంతర్గత రహదారులు, డ్రైన్స్ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 19,861 మంది లబ్ధిదారులకురు. 13.58 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు హుకుంపేట డి బ్లాక్ వద్ద 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న బోర్ వెల్ కు శంకుస్థాపన చేశారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి ఎన్. జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *