-స్టాప్ డయేరియా జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్
కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డెంగ్యూ, మలేరియా పై అవగాహన కల్పించడం, డయేరియా నిర్మూలన పై ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు తీసుకొని వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డెంగ్యూ, మలేరియా మరియు స్టాప్ డయేరియా గోడ ప్రతులను ఆవిష్కరించి , ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను, మందులను చిన్నారులకు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి అందచేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో డెంగ్యూ వైరస్, మలేరియా కేసులు నమోదు కాకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఆమేరకు ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకొని రావాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త శాఖల అధికారులతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
స్టాప్ డయేరియా కార్యక్రమము కింద త్రాగి చల్లార్చిన నీటిని వినియోగం లోని తీసుకుని రావడం, ప్రతి ఇంటిని సందర్శించి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను, జింక్ మాత్రలు అందచేయాలని తెలియ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణ దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. జూలై 1 నుంచి 31 వరకూ డెంగ్యూ పై మాసోత్సవ అవగాహన కార్యక్రమం, స్టాప్ డయేరియా పై జూలై ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు రెండు నెలలు పాటు నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్రత్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు, డీ ఎమ్ హెచ్ వో కే. వెంకటేశ్వర రావు, డి సి హెచ్ ఎస్ ఎన్ పి పద్మశ్రీ, డిఎమ్ (సీఎస్) టీ . రాధిక, ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News