Breaking News

రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

-(పాస్ మనో వికాస్) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
-డయేరియా బాధితులకు మెరుగైన వైద్యo అందిస్తున్నాం: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న (పాస్ మనో వికాస్) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలో వసతి పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వైద్య అధికారులను ఆదేశించారు.

మంగళవారం మద్యాహ్నం స్థానిక రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న (పాస్ మనో వికాస్) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల డయేరియా బాదితులు ఉండే వార్డులను సందర్శించి వైద్య సిబ్బందికి సూచిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది డయేరియా బాదితులలో ఇద్దరు మరణించడం జరిగిందని, మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారికి స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి తరలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను ఎన్ జి ఓ ఆధ్వర్యంలో నడుస్తున్నదని తెలిపారు. ఈ ఆశ్రమంలో సుమారు 6 సంవత్సరాల నుండి 45 సం.. లోపు వయసు గల 72 మంది ఆశ్రయం పొందుతున్నారు. జూలై 6వ తేదీన మద్యాహ్నం అల్పాహారం తీసుకున్న తర్వాత ఆదివారం ఉదయం నుండి కొంతమందికి వాంతులు, విరోచనాలు అయిన వారికి మెట్రోజెల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వారికి అందించడం జరిగిందని, అయినప్పటికీ వారికి డయేరియా కంట్రోల్ కాకపోవడం వలన వారికి మెరుగైన చికిత్స కోసం సోమవారం ఉదయం వారిని సదరు ఎన్జీఓ రుయా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా డయేరియా నియంత్రణ కొరకు అనేక చర్యలు చేపడుతున్నా ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం చాల దురదృష్టకరం కలెక్టర్ అన్నారు. ఆశ్రమంలో ఉన్న మిగిలిన పిల్లలు కూడా డయేరియా బారిన పడకుండా వారికి ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకునే విధంగా అన్నిరకాల చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతోందని తెలిపారు.

అనంతరం స్థానిక పద్మావతి పురంలోని (పాస్ మనో వికాస్) మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసారు. మానసిక దివ్యాంగుల ఆదర్శ ప్రత్యేక పాఠశాలలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో త్రాగునీరు, వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. ఆశ్రమంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో శుభ్రపరిచి స్వచ్చమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం వారికి అందించాలని ఆశ్రమ సిబ్బందికి తెలిపారు. ఆశ్రమంలోని ఇతర పిల్లలకు డయేరియా బారిన పడకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉండేలా ఆదేశించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డిఓ నిశాంత్ రెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి, రుయా సూపెరింటెండెంట్ రవి ప్రభు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా మరియు వయోవ్రుద్దుల శాఖ అధికారి శ్రీనివాస్, ఆశ్రమ పాఠశాల జనరల్ సెక్రెటరీ బాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *