Breaking News

ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించి వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నుండి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో మొదటిసారి నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన 64 అర్జీలలో ఇప్పటివరకు 46 అర్జీలు పరిష్కారం అయ్యాయని, ఇంకా 18 అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటితో పాటు ప్రస్తుతం వచ్చిన 35 అర్జీలను కూడా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంపై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలు మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే పదార్థాలని, వీటి వాడకం వలన చిన్న వయసులోనే జీవితాన్ని కోల్పోవడం జరుగుతుందని, సమాజ హితవును కోరి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలనీ కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. బుర్రకథ కళాకారుల ద్వారా మాదకద్రవ్యాల వినియోగం నివారణకు యానాదులు నివసించే ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు, డిఇఓ తహేర సుల్తానా, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, సిపిఓ గణేషు, డిపిఓ నాగేశ్వరరావు నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శివ ప్రసాద్, ఉద్యాన అధికారి జే. జ్యోతి, డి ఎం హెచ్ వో డా.గీతా బాయి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *