Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యల పట్ల అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం గన్నవరం మండలం గన్నవరం మండలం చిన్న అవుటుపల్లి గ్రామంలోని ఎస్ ఎం కళ్యాణ మండపం లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి గన్నవరం నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

అర్జీలను నమోదు చేసేందుకు మండలాల వారీగా ప్రత్యేకంగా 18 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అర్జీలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, బాపులపాడు,ఉంగటూరు మండలాల్లోని ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని వస్తుంటారని వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.

అర్జీలలో ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, భూ సమస్యలు ఉంటున్నాయన్నారు.

గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందు కోసం జిల్లా కలెక్టర్ తో కలిసి మీ కోసం కార్యక్రమం నిర్వహించామని, అనూహ్యంగా చాలామంది ప్రజలు తమ సమస్యలు తెలుపుకోవడానికి రావడం జరిగిందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు
కృషి చేస్తానన్నారు.

మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ వారి యూనిట్ను నెలకొల్పుటకు సంసిద్ధత వ్యక్తం చేశారని వచ్చే నెలలో మంత్రి లోకేష్ తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అలాగే జీడిమెట్ల నుండి 30 మంది పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారు కూడా మల్లవల్లిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

ఈ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.

విమానాశ్రయానికి ఎదురుగా మల్టీ నేషనల్ కంపెనీలు రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ప్రజల నుండి స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

బాపులపాడు మండలం మడిచర్ల గ్రామ కాపురస్తులు పుట్టా సురేష్ మాట్లాడుతూ మడిచర్ల పోడు భూములకు పట్టా మంజూరు చేయాలని, తమ గ్రామంలో సుమారు 180 కుటుంబాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన నిరుపేద వర్గాలకు 70 సంవత్సరాలకు పైబడి మూడు తరాలుగా రీ సర్వే నంబరు 344 నుండి 397 నంబర్లలో సుమారు 726.50 ఎకరాల భూమిలో మామిడి పామాయిల్ తదితర పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ప్రభుత్వం జీవో సెటిల్మెంట్ ఆర్డర్ ఇచ్చిందని, ఇప్పటివరకు భూమిని ప్రభుత్వం సెక్షన్ 22 (ఏ) కింద నమోదు చేసి ఉన్నారని, మరలా రికార్డులను పరిశీలించి సెక్షన్ 22-ఏ నుండి తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు.

గన్నవరం మండలం దేవాజీగూడెంకు చెందిన తిరివీధి నాగలక్ష్మి తాను గత సంవత్సరం ఇళ్ల స్థలానికి దరఖాస్తు చేసుకున్నానని డాక్యుమెంట్లు గ్రామ సచివాలయంలో ఇచ్చానని అర్హత ఉన్న ఇంటి స్థలం మంజూరు చేయలేదని తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఉంగుటూరు మండలం నాగవరపాడు గ్రామానికి చెందిన కొడాలి అరుణకుమారి మాట్లాడుతూ వెల్దిపాడు గ్రామ బస్టాండ్, తన పొలం సర్వే నంబర్ 91 దగ్గర ఆర్టీసీ బస్సు షెల్టరు, దాని పార్కింగ్ స్థలము కొందరు ఆక్రమించుకొని మద్యం వ్యాపారం చేస్తున్నారని దాన్ని నిరోధించాలని ఫిర్యాదు చేస్తూ అర్జీ అందజేశారు.

బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన రాయి మల్లికార్జున మాట్లాడుతూ తనకు వీరవల్లి హైవే పక్కన ఇంటి స్థలము ఉందని, హైవే కోసం 35 మీటర్ల తీసుకుంటున్నామని జీవో ఇచ్చారని, 27 మీటర్ల వరకే తీసుకున్నారని, రహదారి డ్రైనేజీ పూర్తయిందని తన ఇల్లు పడతోశారని ఇల్లు కట్టుకోవడానికి పోసిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

గన్నవరం మండలం తెంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఎన్.సారంగపాణి మరికొందరు గ్రామస్తులు మాట్లాడుతూ 25 సంవత్సరాల కిందట 16 ఆవాస గ్రామాల కు తాగునీరు సరఫరా చేస్తామని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామపంచాయతీ నుంచి రెండు చెరువులను, సుమారు 18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని, గత 5 సంవత్సరాలుగా పైలట్ ప్రాజెక్టును నీటితో నింపకుండా మూసివేసారని, ఆ స్థలాన్ని గ్రామపంచాయతీకి తిరిగి అప్పగించాలని కేవలం ఒక బోరును మాత్రం ప్రాజెక్టులో వేసి రోజుకోసారి నీరందిస్తున్నారని, పట్టిసీమ ద్వారా నీరు అందించాలని వారు కోరుతూ అర్జీ అందజేశారు. అంతే కాకుండా రాత్రులు 10 నుంచి 15 సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, వర్షం కురిస్తే చాలు అనేకసార్లు ట్రిప్ అవుతుందని, ఒక్కోసారి లో వోల్టేజి, మరొకసారి హై వోల్టేజి వస్తున్నదని ఈ సమస్యను పరిష్కరించాలని అందులో కోరారు.

ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు మూల్పూరి బాలకృష్ణ, దాసరి బాలవర్ధన్ రావు, గుడివాడ ఆర్ డి ఓ పి. పద్మావతి, డి.ఎస్.పి జయసూర్య, ఐ సి డి ఎస్ సి డి పి వెంకటలక్ష్మి, సర్పంచి బడుగు బాలమ్మ, తాసిల్దార్లు పవన్ కుమార్, సుబ్బారావు ఎంపీడీవో సత్య కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *