Breaking News

రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్రా సాంఘిక సంక్షేఈ రోజు మ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

ఆదివారం సాయంత్రం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు డిపో నందు రెండు నూతన స్టార్ లైన్బస్సులను మరియు మూడు సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఒంగోలు డిపో నందు 5 నూతన బస్సులను ప్రారంభించుకోవడం స ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 25 శాతం బస్సులను రీప్లేస్ చేయడం అనేది మంచి పరిణామం అని అన్నారు. కాలం చెల్లిన బస్సులన్నింటినీ రీప్లేస్ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి ప్రాధాన్యతను ఇస్తూ తిరుపతికి కూడా స్లీపర్ కోచ్ ను ఏర్పాటుచేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆర్.ఎం. కు సూచించారు. గత పదిరోజుల్లోనే నందు 4 నూతన స్టార్ లైన్బస్సులను, 5 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పధకాలను అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని అమలు చేయుటకు విధివిధానాల రూపకల్పనలో ఉన్నామన్నారు. భవిష్యత్తులో విడతల వారీగా పాడైన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటుచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మంచి సదుపాయాలతో ఏర్పాటుచేస్తున్న ఆర్.టి.సి బస్సుల ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి, ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
ఆర్.టి.సి ఆర్ఎం మాట్లాడుతూ, ఒంగోలు రీజియన్ లో పాడైన బస్సుల స్థానంలో 67 కొత్త బస్సులు రావడం జరిగిందని, సుమారు 20 నుండి 25 శాతం బస్సులు కొత్త బస్సులు నడుస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మిగతా జిల్లాల్లో కంటే మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆర్.ఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.టి సి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *