Breaking News

జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని పరిశ్రమలు, ఎంప్లాయిమెంట్, డిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని భారీ మరియు మధ్య, చిన్న తరగతి పరిశ్రమలలోని అవకాశాలను ఇదివరకే గుర్తించిన అవకాశాలను యువతకి జాబ్ మేళాల ద్వారా ఇండస్ట్రీ కష్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించవలసిందిగా సూచించారు. జిల్లాలో ఉన్న ఇతర పెద్ద పరిశ్రమలను, కంపెనీలను, వ్యాపార సంస్థలను సంప్రదించి, వారి అవసరాలకనుగుణంగా జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, వారికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో పదవ తరగతి , ఇంటర్మీడియట్,డిగ్రీ,డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఎలక్ట్రీషియన్ , వైర్ మెన్, మోటార్ మెకానిక్ విభాగాలతో ప్లంబర్,తాపీ , కార్పెంటర్ తదితర అంశాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లాలో నైపుణ్య శిక్షణకు సంబంధించిన యాప్ ను డెవలప్ చేసి, కంపెనీలు వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థల తో అనుసంధానం చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో స్టేట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కాలేజీ లో యువతకు శిక్షణ అందించి వారిని వివిధ హోటల్లో వారు ఆన్ జాబ్ ట్రైనింగ్ లో ఉన్నారని, న్యాక్ ద్వారా భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇచ్చి వారికి టూల్ కిట్ అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో డిస్ట్రిక్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభావతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జడ్ఎం ఎపిఐఐసి, రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి, శ్రీ ఎన్ శ్యామ్మోహన్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం, శ్రీ పద్మావతి యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రతినిధులు,ఎల్డిఎం విశ్వనాథ రెడ్డి, ఎడి న్యాక్ సతీష్ చంద్ర, మెప్మా ప్రతినిధి కృష్ణవేణి,జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, గోపి కృష్ణ, ఐటిఐ, పాలిటెక్నిక్ కన్వీనర్స్, ఎస్సీ, ఎస్టి,బీసీ మైనారిటీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్ ప్రతినిధులు, ఏపీఎస్ఎస్డిసి, సీడ్ యాప్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *