Breaking News

వినియోగదారులకి ఉచిత ఇసుక పంపిణీ చెయ్యడం లో రవాణా ధరల విషయములో హేతుబద్ధత కలిగి ఉండాలి

-ఇసుక రవాణా వాహనాల అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు అమలు చేసే బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, రవాణా, మైన్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రవాణా కోసం వినియోగించే వాహనాల యజమానులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చార్జీలను వసూలు చేయాలని, ఈ విషయంలో హేతుబద్ధత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే మీ సమస్యలను తెలుసుకుని ఆ మేరకు సరళీకృత విధానంలో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు , ఆమేరకు సహకారం అందించినట్లు తెలిపారు. గతంలో ఇసుక పాలసీ మేరకు ప్రభుత్వం ఆదాయ వనరుగా పరిగణించి మెట్రిక్ టన్నుకు రూ.375 లు వసూలు ప్రభుత్వ ఖజానా కి చలానా రూపంలో వసూలు చేసేవారమన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుక ముడి సరుకు విషయంలో ప్రజల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని కేవలం ఇసుక త్రవ్వకాల, లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. తద్వారా ప్రభుత్వా ఖజానా కు ఎటువంటి ఆదాయం సమకూరడం లేదని కలెక్టర్ ప్రశాంతి వివరించారు. వాహనదారులు వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చెయ్యాలని, అంతకంటే ఎక్కువగా నమోదు చేసిన సందర్భాలు గుర్తిస్తే ఎఫ్ ఐ ఆర్ నమోదు తో పాటు భారీ జరిమానా విధించానున్నట్లు తెలిపారు.

రవాణా శాఖ, మైన్స్ శాఖల అధ్వర్యంలో ఏమేరకు ఏ రీచ్ లో ఇసుక రవాణా చెయ్యడం జరుగుతుందో ముందస్తు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఏ రోజూ కారోజు ఏ రీచ్ లో ఎన్ని వాహనాలు అనుమతించడం జరుగుతుందో స్పష్టంగా ముందుగా తెలియ చెయ్యడం జరుగుతోంది. వెయిటింగ్ చార్జీలు , అధిక చార్జీల వసూలు చేసే విధానం కు స్వస్తి పలకాలని కలెక్టర్ అసోసియేషన్ ప్రతినిధుల కు విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్ట్ నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సి ఉందన్నారు. అనధికారికంగా ఇసుక త్రవ్వకాలు గానీ, రవాణా చేపట్టినా అటువంటి వారి పై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ , జిల్లాల్లో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ అమలులో రవాణా అసోసియేషన్ ప్రతినిధులు , జిల్లా యంత్రాంగం పరస్పరము చర్చలు జరిపి రవాణా ఛార్జీలు నిర్ణయం విషయములో ఒక నిర్దుష్ట ధరకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సబ్ కలెక్టర్అశుతోష్ శ్రీవాత్సవ్, డి ఆర్వో జి. నరసింహులు, ఆర్డీవో ఏ. చైత్రవర్షిణి, జిల్లా రవాణాఅధికారి కెవి కృష్ణారావు, మైన్స్ ఏడీ ఎమ్. సుబ్రహ్మణ్యం, హౌసింగ్ ఇన్చార్జి పి డీ ఆర్.. కృష్ణా నాయక్, రవాణా వాహనాల అసోసియేషన్ ప్రతినిధులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్ యూనియన్ అధ్యక్షులు రావూరి వీరాస్వామి రాజా,రాజమండ్రి క్వారీ లారీ అసోసియేషన్ అధ్యక్షులు డిఎస్. శ్రీనివాస్, సిద్ధాంతం లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి నాగేశ్వరరావు, తాళ్లపూడి లారీ అసోసియేషన్ అధ్యక్షులు  సతీష్, సీతానగరం లారీ అసోసియేషన్ అధ్యక్షులు వేముల చిట్టిబాబు కొవ్వూరు లారీ అసోసియేషన్ అధ్యక్షులు తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *