జాతీయ లోక్ అదాలత్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.09.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం,అమలాపురం , కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని , ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు , అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడును. కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు ది. 14.09.2024 న (శనివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా తెలియ జేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *