అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా సేవలకు సంబంధించి వినియోగదారుల యొక్క ఫిర్యాదులు మరియు సమస్యలు పరిష్కరించు నిమిత్తము తేది: 03/09/2024 మధ్యాహ్న 3:00 గంలకు, డి.యస్.వి.ఆర్. మూర్తి (IPOS), పోస్ట్ మాస్టర్ జనరల్, విజయవాడ రీజియన్, విజయవాడ వారిచే రీజనల్ తపాలా అదాలత్ నిర్వహించబడును. తపాలా సేవలకు సంబంధించిన ఫిర్యాదులు మరియు సమస్యలు ఈ అదాలత్ నందు పరిష్కరించబడును. తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులు తేది: 02/09/2024 లోగా “తపాలా అదాలత్” శీర్షికతో అసిస్టెంట్ డైరక్టర్ (స్టాఫ్), పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం, గాంధీనగర్, విజయవాడ-520003 అను చిరునామాకు పంపవలసినదిగా కోరడమైనది. ఫిర్యాదు దారులు వ్యక్తిగతంగా కూడా హాజరు కావొచ్చునని పోస్ట్ మాస్టర్ జనరల్ వారు తెలిపారు.
Tags amaravathi
Check Also
పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…
-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …
Prajavartha Online Telugu News