Breaking News

లోతట్టు మరియు కొండ ప్రాంతాలలో నివసించు ప్రజలందరూ సురక్షిత ప్రదేశములకు తరలి రావాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిన్న సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమై వున్నందున మరియు రాగల 2 రోజులు భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున లోతట్టు మరియు కొండ ప్రాంతాలలో నివసించు ప్రజలందరూ సురక్షిత ప్రదేశములకు తరలి వెళ్ళవలసినదిగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలను కోరారు. ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని .ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఎక్కడైనా గృహాలు బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే ఆ కుటుంబాలు సమీపంలో ఉన్న పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని, విజయవాడ నగరపాలక వారు 24×7 కంట్రోల్ రూమ్ లో వరదలు సంబంధించి ఎటువంటి సమస్యలైనా అందుబాటులో ఉంటారని, నగర పౌరులకు వరద సంబంధించి ఎటువంటి సమస్య అయినా సరే ఈ ఫోన్ నెంబర్లకు 0866-2424172, 0866-2427485 ఫోన్ చేసి తెలుపవచ్చని, 8181960909 ఈ ఫోన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలుపవచ్చని, తెలిపిన వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకుంటారని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *