Breaking News

వరద బాధితులకు దివీస్ సంస్థ ఆపన్నహస్తం…

-2 కోట్ల 50 లక్షల ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చిన దివీ లాబ్స్ యాజమాన్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూఫాన్ కారణంగా గత రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలోకి భారీ ఎత్తున వరద నీరు చేరటంతో వేలాది గృహాలు నీటమునిగిపోయాయి. ఈ పరిస్థితులలో ప్రజలు, పిల్లలు, వృద్దులు భోజన సౌకర్యం లేక అల్లాడిపోతున్నారానే వార్తలు వెలువడుతున్న తరుణంలో దివీస్ యాజమాన్యం తక్షణమే స్పందించి ఆకలితో అలమటించే ప్రజల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ప్రతి రోజూ 1 లక్ష 70 వేల మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజన సౌకర్యం కల్పించాలని దివీస్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. హరే కృష్ణచారిటబుల్ ఫౌండేషన్, ఏ.పీ అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజన సౌకర్యం అందజేయుటకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఆహారాన్ని 3 పూటలా రానున్న 5 రోజులపాటు అందించేందుకు అయ్యే ఖర్చు సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలు దివీస్ సంస్థ హరే కృష్ణచారిటబుల్ ఫౌండేషన్ కు చెల్లింస్తుందని సంస్థ ఎండి. డా. మురళీ కృష్ణ తెలిపారు. అవసరమైతే మరి కొన్నిరోజులు ఆహారాన్ని తయారు చేయించి ముంపు ప్రాంతాలకు పంపిణీచేసేందుకు దివీస్ సంస్థ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

ఇటువంటి విపత్కర సమయంలో ముందుగ ఆపన్న హస్తాన్ని అందిస్తున్న దివీస్ సంస్థ వారికి హరే కృష్ణచారిటబుల్ ఫౌండేషన్, ఏ.పీ, అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మంగళగిరి క్లస్టర్, సంస్థ ప్రతినిధి శ్రీమాన్ వంశధార దాస, జిల్లా కలెక్టర్ జి. సృజన ధన్యవాదలు తెలియజేశారు. ముంపు ప్రాంత వాసులకు అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ద్వారా ఆహారాన్ని అందించేందుకు సహకరిస్తున్న దివీస్ యాజమాన్యాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *