Breaking News

కొవ్వూరు ఐసిడిఎస్ పరిధిలో 12 ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

-సిడిపివో ఎమ్. మమ్మీ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకము కొవ్వూరు నందు 12 అంగన్వాడి కేంద్రములలో ఖాళీగా ఉన్న 12 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు కోరబడుచున్నవని కొవ్వూరు శిశు అభివృద్ధి పధక అధికారిణి డి . మమ్మీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఏ అంగన్వాడీ కేంద్రమునకు, సహయకురాలు పోస్టు నకు ధరఖాస్తు చేయుచున్నది దరఖాస్తులో స్పష్టముగా ఉండవలెను.

ఉద్యోగ వివరము : అంగన్వాడి హెల్పరు (ఆయా), ఖాళీగా ఉన్న అంగన్వాడి కేంద్రము, రిజర్వేషన్ కేటగిరి వివరాలు తెలియ చేస్తూన్నామన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, స్థానికులైన వివాహిత మహిళలు మాత్రమే అర్హులు, కనీస విద్యార్హత 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను. గమనిక. అదనపు విద్యార్హతలకు ప్రాముఖ్యత ఇవ్వబడదు. ది.1.7.2024 నాటికి 21 సంllలు నిండి 35 సం|| లోపు వయస్సు ఉండవలెను. వికలాంగులు అతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే పరిశీలించబడుదురు ( తమ విధులు తాము నిర్వర్తించుకొనువారు అర్హులు)

ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకురాలి పోస్టు ( రిజర్వేషన్ ) వారీగా కుమారదేవం-1 ( బిసి – ఏ) వేములూరు -3 (ఓపెన్ క్యాటగిరి) , చాగల్లు-4 (బిసి-బి) , మెహర్ బాబా గుడి (6 వ వార్డు) (ఓపెన్ క్యాటగిరి) , చిక్కాల-4 (యస్ టి.) , నెలటూరు-1 (ఓపెన్ క్యాటగిరి) , గౌరీ పల్లి (బిసి-బి) , రామ సొసైటీ (18 వ వార్డు)ఓపెన్ క్యాటగిరి , మలపల్లి-3 (యస్.సి.) , పెనకనమెట్ట- 3 (ఓపెన్ క్యాటగిరి) , అరికిరేవుల-2 (బిసి – డి) , చంద్రవరం: 2 ( బిసి – ఇ)

ధరఖాస్తుతో పాటుగా తగు ధృవీకరణ పత్రములు జత చేసి (నివాసము,కులము, విద్యార్హతలు, 10 తరగతి మార్కులిస్ట్, పుట్టిన తేదీ, అంగవైకల్యం, భర్త మరణించినచో మరణ ధృవీకరణ పత్రము, మైనర్ పిల్లలు కలిగి ఉన్నచో దానికి సంబంధించిన, దృవీకరణ పత్రములు మరియు ఫ్రీ స్కూలు ట్రైనింగ్ అయినచో సదరు ధృవీకరణ పత్రములు 1 మొదలగు వాటిని గెజిటెడ్ అధికారితో అటస్టేషన్ [attestation) చేయించుకుని ది.11.09.2024 నుండి 20.09.2024 సాయంత్రం 5.00 గం||లోపు ఈ కార్యాలయమునకు అందచెయ్య వలెను.

పూర్తి చేసిన ధరఖాస్తును శిశు అభివృద్ధి పధక అధికారిణి, సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కొవ్వూరు కార్యాలయము నందు నమోదు చేయించుకొనవలెను. నిర్ణీత గడువు ముగిసిన పిదప అందిన దరఖాస్తులు పరిశీలించబడవు. ఈ ప్రకటన పూర్తిగా రద్దు పరచుటకు గాని లేదా మార్పులు చేయుటకు గానీ ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము కొవ్వూరు వారికి అధికారములు కలవు, మరిన్నీ వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించగలరని తెలియ చేయడ మైనది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *