ప్రజా,ప్రభుత్వ , ప్రైవేట్ రంగ భాగస్వామ్య (పి.పి.పి.పి) సహకారoతో పర్యాటక రంగ అబివృద్ధికి కృషి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాను పర్యాటక రంగo అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యా టక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యా టక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి , ఎస్ వి జూపార్క్ క్యూరేటర్ సెల్వం తో కలిసి జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి విస్తారమైన అవకాశాలు కలవని తెలిపారు. యాత్రికులను ఆకర్షించే దిశగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలైన ముఖ్య బీచుల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యటరంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎకో టూరిజం క్లబ్బులను వివిధ పాఠశాలు, కళాశాలలో ఏర్పాటుచేసి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా లఘు చిత్ర పోటీలను నిర్వహించడం వలన పర్యాటక రంగంపై ఆసక్తితో పాటు పర్యాటక ప్రదేశాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, , మెప్మా పిడి ప్రభావతి, డిప్యూటీ సీఈవో ఆదిశేషరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *