Breaking News

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా – 2024

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్ల కు దిశా నిర్దేశనం
-క్షేత్ర స్థాయిలో అవగాహాన, అమలు కార్యక్రమాలు
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమం లో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకూ  మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరు విడిది కార్యాలయంలో “స్వచ్ఛతా హి సేవా – 2024” గోడ ప్రతులను ఆమె ఆవిష్కరించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నిరబ్ కుమార్ ప్రసాద్ “స్వచ్ఛతా హి సేవా ” కార్యక్రమం అమలుపై దిశా నిర్దేశనం చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులతో మాట్లాడుతూ, సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో అమలుచేసే కార్యక్రమాలపై నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, అమలు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ను, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రభుత్వం నిర్దేశించిన మూడు అంశాలతో కూడిన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నారు.  మొదటిగా పరిశుభ్రత లక్ష్య యూనిట్లు (CTUలు) – శ్రమదాన్ కార్యకలాపాలు లక్ష్యలని నిర్దేశించుకుని కాలపరిమితి తో కూడిన మార్పు & సాధారణ శుభ్రత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెండవ అంశంగా ప్రజల భాగస్వామ్యం, అవగాహన, సహెతుకమైన దిశగా అడుగులు వేయడం ద్వారా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మూడోవ అంశంగా ముందస్తు ఆరోగ్య తనిఖీ మరియు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు.

పరిశుభ్రత లక్ష్య సాధనకు బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సంస్థాగత భవనాలు, వాణిజ్య & మార్కెట్ ప్రాంతాలు, విద్యా సంస్థలు, ప్రజా రవాణా కేంద్రాలు, ప్రధాన రహదారులు & రహదారులు, రైల్వే స్టేషనులు, రైలు పట్టాలు, అభయారణ్యాలు, జంతుప్రదర్శనశాలలు & రక్షిత ప్రాంతాలు, ట్రెక్కింగ్ & క్యాంపింగ్ సైట్లు, నీటి వనరులు (నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు మొదలైనవి) , పర్యాటక ప్రదేశాలు, మతపరమైన & ఆధ్యాత్మిక ప్రదేశాలు ,  వారసత్వ సంపద  ప్రదేశాలను శుభ్రపరచడం , వాటిని సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. స్వచ్ఛత లో ప్రజల భాగస్వామ్యం, అవగాహాన కల్పించడం కోసం స్వచ్ఛతా ప్రతిజ్ఞలు, కార్యశాలలు ( వర్క్‌షాప్‌లు) , మారథాన్లు , సైక్లోథాన్స్ , మానవ హారం, గ్రామ సభలు, యువతను భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

ఆరోగ్య , సామాజిక భద్రత కల్పించడం కోసం సింగిల్ విండో విధానం లో క్యాంపులు – ఆరోగ్య తనిఖీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం తో సామాజిక రక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి సంక్షేమ పథకాలకు అనుసంధానం చేపట్ట వలసి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.  హౌసింగ్ ప్రధాన మంత్రి అవాస్ యోజన, ప్రతి ఇంటికి  కుళాయి కనెక్షన్, మరుగుదొడ్లు, విద్యుత్, అమృత్ జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ , పీఎం సౌభాగ్య ,  ప్రధానమంత్రి జన్ ధన్ యోజన , బ్యాంకింగ్ ద్వారా ఋణ సౌకర్యం, ఉజ్వల్ ద్వారా ఎల్ పి జి కనెక్షన్ ,  ఆరోగ్య బీమా కుటుంబ భద్రత, ఆయుష్ మాన్ భారత్ రోగ నిరోధకత కోసం ఆరోగ్య పరిరక్షణ  తదితర  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పథకాలతో  కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్డ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, సిపివో ఎల్. అప్పాలకొండ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డీ. బాల శంకర రావు, డి ఎం హెచ్ ఓ కే. వేంకటేశ్వర రావు, డి ఆర్ డి ఏ- పి డి  ఎన్ వివి ఎస్ మూర్తి, ఐసిడీఏస్ పిడి కే. విజయ కుమారి, డిఎల్ డివోలు  పీ. వీణా దేవి, వి. శాంత మణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *