Breaking News

సాధారణ తనిఖీల్లో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పి ప్రశాంతి

-ప్రజా సమస్యల, అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు
-గురువారం సాయంత్రం తాళ్లపూడి మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి కార్యాలయ రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిథిలో మ్యూటేషన్ కు చెందిన రెండు దరఖాస్తులు పెండింగుకు సంబంధించిన వివరాలు పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకా లను అనుసరించి సకాలంలో పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పి జి ఆర్ ఎస్ – మీకోసం ద్వారా వస్తున్న ఆర్జీల పరిష్కార స్థాయి పై ప్రత్యెక దృష్టి పెట్టాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమం లో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకూ  మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే క్రమంలో మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్శన లో తహసిల్దార్ బి. రవీంద్రనాథ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *