Breaking News

ఇంపీకప్స్ హాస్పిటల్ లో “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో “ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో” విజయవాడ,బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఇటువంటి సద్వైద్య సంభాషణ లలో పాల్గొనడం తప్పనిసరి అని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ,మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ లో పొందుపరిచారు. ఆయుర్వేద వైద్యులు ఆందరూ కoటిన్యూవస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో తప్పనిసరిగా పాల్గొని విజ్ఞాన సముపార్జన తో పాటు వారి డిగ్రీ సర్టిఫికేట్ ల రెన్యూవల్స్ కి అవసరమైన క్రెడిట్ పాయింట్స్ పొందాలి.ఈ విషయంపై ఆయుర్వేద గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వారు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

2018 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్ వైద్యాలకు స్థానం కలిపించి, ప్రజలు వారికి నచ్చిన వైద్యం ఎంచుకునే స్వేచ్ఛ కలిపించే దిశగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు కి కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఇటీవల స్పందించడం హర్షణీయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృషి చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో డా.ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద లైబ్రరీ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉత్తమ వైద్య శ్రీ పమ్మి సత్యనారాయణ శాస్త్రి చర్మవ్యాధులు-అనుభవ వైద్యం అంశంపై మాట్లాడుతూ చర్మవ్యాధులు పై గ్రంధస్థంగా ఉన్న మరియు తన అనుభవo లోని చికిత్సలను సభలో తెలిపారు. ఈ కార్యక్రమంకి సమన్వయ కర్తగా డా. పమ్మి సూర్యకుమార్ వ్యవహరించారు.డా. ప్రియాంక, డా. జాబిల్లీ సహకారం అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్య శ్రీ పమ్మి సత్యనారాయణ శాస్త్రి ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *