Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో నిత్యవసర కిట్లు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు భవానిపురం లోని పోలీస్ కాలనీ రామ్మోహన్ ఎన్ క్లేవ్ లో ఆదివారం నిత్యవసర సరుకుల ను పంపిణీ చేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా రామ్మోహన్ ఎన్క్లేవ్ లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వారికి నిత్యావసరాలను అందజేయాలని స్థానిక పెద్దలు కొంగర సాయి ఎమ్మెల్యే సుజనాకు విజ్ఞప్తి చేశారు. తక్షణమే వారికి నిత్యవసర కిట్లను అందజేయాలని సుజనా ఆదేశాలు జారీ చేయగా కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, వారి వద్దకే వెళ్లి నిత్య అవసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ సిబ్బంది చింతా బాబి, మంతెన తరుణ్, రాహుల్, రాజేష్, కూటమి నాయకులు బొల్లేపల్లి కోటేశ్వరరావు, కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు నిత్యవసరాలను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *