చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు…

నర్సీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయబడినవి, అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటిన్లను నిలిపివేసింది. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ఈ అన్న క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు నిలిపివేయడంతో స్వంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మవతి, రెండు రూపాయలకే అన్న క్యాంటిన్ నిర్వహించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటిన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్యాంటిన్లు పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయని, ప్రతి రోజు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సతీమణి పద్మావతి, కోడలు దివ్యరాజేష్, జిల్లా కలెక్టర్లతో కలిసి అన్నా క్యాంటీన్ భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి చింతకాయల పద్మవతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జనసేన ఇన్‌చార్జి సూర్యచంద్ర, జడ్పిటిసి రమణమ్మ ఆర్డీవో జయరామ్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *