Breaking News

ప్రజల ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా చాలా అవసరం…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీని ఆచరణాత్మకంగా ఉండేలా మండల, జిల్లా, రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ తయారీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా విజన్ డాక్యుమెంట్ పక్కాగా తయారు చేయాలనీ, అలాగే ప్రభుత్వానికి ప్రజల ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా చాలా అవసరం అని జిల్లా, మండల, మునిసిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అన్ని డివిజన్ల, మునిసిపల్, మండల, గ్రామ వార్డు సచివాలయాల అధికారులతో జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీపై సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన గోడ పత్రికలను అన్ని ముఖ్య కూడళ్ల లోనూ, బ్యాంకులు, సచివాలయాలు, మండల, డివిజన్, పంచాయితీ కార్యాలయాలు వద్ద ప్రదర్శించాలని అన్నారు. గ్రామ స్థాయిలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీలో భాగంగా వార్షిక, 5 సం.ల విజన్ డాక్యుమెంట్ తయారీ ప్రజల భాగస్వామ్యంతో తయారు చేయాలని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ – 2047 డాక్యుమెంట్ తయారీ పై ప్రభుత్వానికి సూచనలు/అభిప్రాయాలను అందజేసి.. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్

* స్మార్ట్ ఫోన్ నుండి.. http://swarnandhra.ap.gov.in/Suggestions. లింక్ తో వచ్చే QR కోడ్‌ ద్వారా పాల్గొని.. గౌ౹౹ ముఖ్యమంత్రి ఫోటోతో పాటు సంతకంతో కూడిన సర్టిఫికేట్ ను స్వీకరించండి.

QR కోడ్‌ని స్కాన్ చేసే విధానం

1. పేరు నమోదు చేయండి
2. మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
3. జిల్లాను నమోదు చేయండి
4. వయస్సును నమోదు చేయండి
5. లింగాన్ని నమోదు చేయండి
6. వృత్తిని నమోదు చేయండి
7. ఇ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి
ఈ కార్యక్రమంలో డి ఎల్ డి ఓ సుశీలాదేవి, సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *