Breaking News

ఇది మంచి ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రజా సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్న ప్రజా ప్రభుత్వం : గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

-ఇది మంచి ప్రభుత్వం… ప్రజల ముంగిటకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్లి వారికి 100 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వ హామీలపై, చేపట్టనున్న కార్యక్రమాలపై వివరించి, ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం లక్ష్యం : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-ఇది మంచి ప్రభుత్వం… కార్యక్రమంలో అధికారులు ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన వివరాలు తెలిపి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా

గూడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి గౌ. ముఖ్యమంత్రి ఇచ్చిన స్పూర్తి, ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలు వివరించి, చేయబోతున్న కార్యక్రమాలు వివరించి,వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు చిల్లకూరు మండలం ఏరూరు నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఏరూరు సర్పంచ్ కామాక్షి తో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు.
సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి కొంత సమయం కేటాయించి మన ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన పనులను, ఇచ్చిన హామీలలో నెరవేర్చిన వాటిని తెలుపుతూ, రానున్న కాలంలో చేపట్టే కార్యక్రమాలను తెలపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నందు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారి కుటుంబం పొందుతున్న సంక్షేమ పథకాలు, అర్హులై యుండి పథకాలు రాని వారి సమస్యలు, గ్రామ, వార్డు సమస్యలు తెలిపితే వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా కొనసాగాలని గౌ. ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారని అన్నారు. మన రాష్ట్రంలో ఇస్తున్నంత పెద్ద మొత్తంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పలు కేటగిరీల కింద పేదలకు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయాన్నే 6 గంటల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతోందని, ఈ నెల ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్లను ఆదివారం ఉందని ఒక రోజు ముందుగానే ఆగస్ట్ 31 ననే అందించి గొప్ప మనసు కలిగిన ప్రజా పాలకుడిగా ఆదర్శంగా మన ముఖ్యమంత్రి నిలిచారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పెన్షన్లు పెంచారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పలు హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చారని అన్నారు. తొలి సంతకం నిరుద్యోగులకు మెగా డిఎస్సీ పై సంతకం చేశారని అన్నారు. క్రీసిటీ ఏర్పాటు తో గూడూరు నియోజక వర్గం చిల్లకూరు మండలం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సర్పంచ్ తెలిపిన వీధి దీపాల సమస్య తీర్చి వెలిగేలా చర్యలు చేపడుతామని ఎంపిడిఓ కి ఆదేశించామని అన్నారు. అల్లిపురం ఓవర్ హెడ్ ట్యాంకు ఏర్పాటుకు జల్ జీవన్ మిషన్ కింద చర్యలు చేపడుతామని అన్నారు. క్రీక్ అంశం, కృష్ణ పట్నం పోర్టు మీదుగా ప్రజలకు దారి అంశం పై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలంలోని ప్రజలు కోరిన మేరకు వారి ఇంటి స్వంత నిర్మాణాలకు మట్టి, గ్రావెల్ ఎద్దుల బండి, ట్రాక్టర్లతో తీసుకెళ్లడానికి ఎలాంటి ఆక్షేపణ ఉండదని కలెక్టర్ తెలిపారు. అలాగే సాగులో ఉన్న డికెటి మరియు సి జే ఎఫ్ ఎస్ భూముల రైతులకు సాగరమాల కింద పరిహారానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ నందు ఏర్పడిన వరదల సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది రోజుల పాటు కృషి చేసి బస్సులో ఉంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించారని, ఆయన స్పూర్తి అందరికీ ఆదర్శం అని అన్నారు. పరిశ్రమలు రావడం వలన నిరుద్యోగ యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రజా వేదిక అనేది ప్రజల ముంగిటకు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాలనా యంత్రాంగం వచ్చి మీతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమం ప్రజల ముంగిటకు సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మేలును అమలు చేసిన హామీలు వివరిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సీ విడుదల నిరుద్యోగ యువతకు భరోసా అని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అని, విజయవాడ నగరం వరదలతో అతలాకుతలం అయి ప్రజలు విలవిల లాడుతున్న సందర్భంలో మన గౌ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజులు నిద్రాహారాలు మాని బస్సు లో ఉండి ప్రజలను ఆదుకున్నారు అని అన్నారు. అలాగే వరదల్లో నీట మునిగిన ఇల్లు, వాహనాలు, పంటలు నష్ట పోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. వచ్చే దీపావళికి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇవ్వనున్నారని, త్వరలోనే తల్లికి వందనం అమలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో ప్రధాని గారితో మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సత్సంబంధాలు కలిగి ఉండడం వలన మన రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వంలోని పలువురు తిరుమల లడ్డు అంశంలో అనేక అవకతవకలకు పాల్పడినారని వాటిపై ముఖ్యమంత్రి తప్పక చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆగిన పెండింగ్ బిల్లులు నిబంధనల మేరకు ప్రభుత్వం చెల్లించనున్నారని తెలిపారు. చిల్లకూరు మంచి సంపన్న, అభివృద్ధి చెందిన మండలంగా ఉంటుందని తెలిపారు. మైనింగ్ నుండి నీరు కలుషితం ఐతున్నదని పలువురు తెలిపిన మేరకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆదర్శంగా పని చేస్తున్నారని, అలాగే మా ప్రజా ప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టించి ప్రజల్లో ఎల్లప్పుడూ ఉండాలని సూచించారని అన్నారు. బాలిరెడ్డి పాలెం బ్రిడ్జి మరమ్మత్తులకు కలెక్టర్ సహృదయంతో రూ. 1.75 కోట్లను అందించారు అని వారికి ధన్యవాదాలు తెలిపారు.

గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, డ్రిప్ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కార్యక్రమంలో సచివాలయం అధికారులు వచ్చినప్పుడు వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తారని, గ్రామ సమస్యలు ఉంటే తెలపాలని అన్నారు.

పలువురు ప్రజలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడారు. అనంతరం ప్రజల నుండి ప్రజా వేదికలో కలెక్టర్, ఎమ్మెల్యే అర్జీలు తీసుకున్నారు.

కార్యక్రమ అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కింద ఏర్పాటు చేసిన పోషణ మాసోత్సవాల స్టాల్ ను పరిశీలించి అక్కడ ఉన్న శిశువుకు కలెక్టర్ పాయసం తినిపించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించి వారికి చీర పసుపు కుంకుమలు అందచేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, పశు సంవర్థక శాఖ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ గూడూరు వాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద రావు, ఏపీఎంఐపి పిడి సతీష్, తదితర అధికారులు ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *