-అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా, రాష్ట్ర ప్రజలపై స్వామివారి కరుణా కటక్షాలు, ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నా: దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా, రాష్ట్ర ప్రజల పై తిరుమల శ్రీవారి కరుణా కటక్షాలు, ఆశీర్వాదాలు ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపం నందు మంత్రికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలుకగా అదనపు ఈఓ ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు.
శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కరుణాకటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజమంతా కూడా ఆరాధిస్తోందని అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరిగేలా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకున్నానని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలతో స్వామివారికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామి వారిని వేడుకొని అక్టోబర్ 4వ తారీఖున ప్రారంభం అయ్యేటటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించు సాంప్రదాయబద్ధమైన, ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమం లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 4వ తారీఖు నుంచి 12వ తారీకు వరకు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖసంతోషాలని, సౌభాగ్యాలను ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని స్వామి వారిని ప్రార్థించుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతో సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని పర్యవేక్షించి ఇంకా ఏమైనా చేయాల్సి ఉన్నాయ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం జరిగిందని అలాగే స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయిందని స్వామి వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉండేలా ప్రగాఢమైన విశ్వాసంతో దేవదేవుని ఇవాళ దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఈ తిరుమల ఆలయం యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి అయిన శ్యామల రావు, అలాగే అదనపు ఎగ్జిక్యూటివ్ అధికారి వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి నివేదికలను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ ను తిరుమల లడ్డు అంశంపై వేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడ ఏం జరిగిందన్న విషయం సిట్ ఇచ్చిన నివేదికలో బయటపడుతుందని తెలిపారు. రాబోవు బ్రహ్మోత్సవాలపై దృష్టి పెట్టి, పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతో, వారి సూచనల తోటి తిరిగి శాంతిని చేకూర్చే హోమాలను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నామని తెలిపారు. స్వామి వారి యొక్క అన్న ప్రసాదం దగ్గర నుంచి లడ్డు ప్రసాదాలు ఇతర ప్రసాదాలు నైవేద్యంగా ఇచ్చేటటువంటి అన్ని ప్రసాదాలు కూడా స్వచ్ఛత తో ఉండాలని ఏ ఒక్కటి తేడా జరిగినా ఉపేక్షించేది లేదని గౌ. ముఖ్యమంత్రి వర్యులు తెలిపారన్నారు. అదేవిధంగా అధికార యంత్రాంగం ఆ దిశలో పనిచేయాలని సూచించారు ఎలాంటి అపవిత్ర కార్యక్రమం తిరుమలలో జరగనివ్వమని ఒకవేళ జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు.
Prajavartha Online Telugu News