Breaking News

అబ్బుర పరచిన బజాజ్‌ పల్సర్‌ బైక్‌ స్టంట్‌ షో

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నున్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వరుణ్‌ బజాజ్‌ షోరూం వారి పల్సర్‌ బైక్‌ స్టంట్‌ షో ఆహుతులను అబ్బురపరిచింది. నున్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో వరుణ్‌ బజాజ్‌ షోరూం ఆధ్వర్యంలో నూతన బైక్‌ బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 సిసి బైక్‌ కొరకు ప్రత్యేకంగా నున్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం టెస్ట్‌ రైడ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ యువతకు నచ్చిన విధంగా అన్ని క్వాలిటీస్‌తో బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 సిసి బైక్‌ను నూతనంగా సిద్ధం చేశామని విద్యార్థులు, యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని బజాజ్‌ వాహనాల్లోనే అత్యంత విశిష్టత కలిగిన పల్సర్‌ బైక్‌ను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పల్సర్‌ బైక్‌ స్టంట్‌ షో విద్యార్థులను, యువతను అమితంగా ఆకట్టుకుంది. కంపెనీ ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులు వరుణ్‌ బజాజ్‌ ఎజిఎం వెంకట్‌, సింగ్‌నగర్‌ మేనేజర్‌ తులసీరావు మాట్లాడుతూ దసరా, దీపావళి సందర్భంగా ప్రతి బజాజ్‌ వాహనం కొనుగొలుపై అరిస్టోక్రాట్‌ ట్రాలీ ట్రావెల్‌ సూట్‌కేస్‌ ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నామని కస్టమర్లు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మరింత లబ్ధి పొందాలని, తమ వాహనాల ప్రదర్శనకు మంచి స్థలాన్ని అందించిన నున్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యజమాన్యానికి కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డా.శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ శేఖర్‌రెడ్డిలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాలలో ఉన్న విద్యార్థులు, యువత మాత్రం బజాజ్‌ బైకుల పట్ల తమ ఇష్టతను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా త్వరలోనే మంచి బైకులను కొనుక్కుంటామని ఆనందంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు నున్న వికాస్‌ ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, అధ్యాపక బృందం, వరుణ్‌ బజాజ్‌ సిబ్బంది, మరియు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా శానిటరీ సిబ్బందికి ప్రత్యేక విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యునైటెడ్ తెలుగు కిచెన్ (యూటీకే) 5వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *