-రాష్ట్ర దేశ ఆర్ధిక మూలలు బలోపేతం లో పర్యటక పాత్ర కీలకం
-కలెక్టరు ప్రశాంతి
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడపడం ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం సాధ్యపడగలదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యక్తుల, సాంస్కృతిక, సామాజిక పరంగా ఆయా ప్రాంతాలు పర్యాటకపరంగా ఎంతో ప్రాచూర్యం పొందుతాయని అన్నారు. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం , దసరా వేడుకలు, బుల్ ఫైట్ పరంగా కర్ణాటక, గోదావరి పుష్కరాలు నేపథ్యంలో రాజమహేంద్రవరం, పడవ పందాలు , ఎలిఫెంట్ ఫెస్టివల్ నేపథ్యంలో కేరళ, స్వచ్ఛ నగరం గా ఇండోర్ నగరం ప్రకృతి వ్యవసాయం పరంగా సిక్కిం రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయన్నారు. పర్యాటక రంగం ప్రభావితంతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వడం తో పాటుగా సేవా రంగం ఉపాధిరంగం, మౌలిక రంగ పరంగా అభివృద్ది సాధ్య పడుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
స్థానికంగా పర్యాటకపరంగా ఆశ్రిత కలిపే ఆసక్తి కలిపే అంశాలతో కూడి రూపొందించిన ఫోటో ప్రదర్శన, వీడియో ప్రదర్శన తదితర విభాగాల్లో ప్రదర్శించిన అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయని కలెక్టరు పేర్కొన్నారు. వేదంలా ఘోషించే గోదావరి అనే గేయంతో మనం ఈ ప్రాంతం ఎంతో నమ్మేకమై ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరంగా విజ్ఞానంతో పాటు ఆర్థికంగా కూడా మూలాలు బలోపేతం ఆయా ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు. రానున్న రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడంలో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా ఈ ప్రాంతానికి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వై శ్రీనివాస్, టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ పర్యటన దినోత్సవం సందర్భంగా 61 మంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయ శంకర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల బృందం, నన్నయ యూనివర్సిటీ బృందం, శ్రీవత్సలా బృందం, ఆచంట చంద్రశేఖర్ బృందం ప్రదర్శించిన 12 ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి.
విజేతల వివరాలు వ్యాసరచన భాగంలో కేసురావ్య మొదటి బహుమతి కే కీర్తిక రెండో బహుమతి పి సింధు మూడో బహుమతి గెలుపొందారు ఫోటోగ్రఫీ భాగంలో మొదటి బహుమతి, ఈ సురేష్ ద్వితీయ బహుమతి , సిహెచ్ ఎస్తేరు రాణి మూడో బహుమతి, గెలుపొందగా వీడియో గ్రాఫీ విభాగంలో బీసీ వెంకటచరణ్ మొదటి బహుమతి, బి సౌమ్య దీపిక రెండవ బహుమతి, కే శివశంకర్ 3వ బహుమతి గెలుపొందారని పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామి నాయుడు తెలిపారు.
Prajavartha Online Telugu News