-అత్యంత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
-ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ (ఏపీ జీఎన్ఏ) ఎన్నికల మొత్తం ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా కోఆపరేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న తనను ఏపీ జీఎన్ఏ ఎన్నికల నిర్వహణ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర సహకార, సహకార సంఘాల రిజిస్ట్రార్ కమిషనర్ నుంచి తాజాగా మార్గదర్శకాలు అందినట్లు వెల్లడించారు. అసోసియేషన్ బైలాస్, ఏపీ సీఎస్ (ఆర్‌వోఎస్ఏ) నిబంధనలు-2001 ప్రకారం ఉమ్మడి జిల్లాల ఓటర్ల జాబితాతో అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Prajavartha Online Telugu News