Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవ రాత్రుల్లో ముఖ్యమైన మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశ్వీరచన మండపంలో మంత్రి సవితకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మంత్రి సవిత… భక్తులతో ముచ్చటించారు. సదుపాయాలు బాగున్నాయని, తాగునీరు, మజ్జిగ అందచేస్తున్నారని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *